TS: రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ఫ్రొఫెసర్ లింబాద్రి
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ లింబాద్రి నియమితులయ్యారు. ఈ మేరకు ఇవాళ సిఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తదనంతర ఉత్తర్వులు ఇచ్చే వరకు లింబాద్రి ఈ స్థానంలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షుడిగా ప్రొఫెసర్ లింబాద్రి కొనసాగుతున్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ఉన్న పాపిరెడ్డి పదవీకాలం ఇవాళ్టితో ముగియడంతో లింబాద్రికి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా లింబాద్రి మంత్రి కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.