జీఓ 46ని రద్దు చేయాలంటూ కానిస్టేబుల్ అభ్యర్థుల నిరసన
హైదరాబాద్ (CLiC2NEWS): జీఓ 46 ని రద్దు చేయాలంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. జీఓ 46 వలన తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించాలని వారు కోరారు. గత ప్రభుత్వంలోని హోంమంత్రికి అవగాహన లేక.. బోర్డు ఛైర్మన్ శ్రీనివాసరావు చేసిన తప్పదం వలన అనేక మంది కానిస్టేబుల్ అభ్యర్థులు నష్టపోయారని.. వెంటనే ప్రభుత్వం ఆ జీఓను రద్దు చేసి న్యాయం చేయాలని కోరారు.