పి.ఆర్.టి.యు. తెలంగాణ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం

కాగజ్‌నగర్ (CLiC2NEWS): జిల్లా అద్యక్షులు పర్వతి రాజేశ్వర్ అధ్యక్షతన కాగజ్ నగర్ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో జరిగిన పి.ఆర్.టి.యు. తెలంగాణ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశము జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ప్రభుత్వ ఛీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సంఘం నిర్మాణం జరిగినప్పటి నుండి కృషి పట్టుదలతో నిబద్ధతతో నిజాయితీతో పని చేసేవారే మన సంఘంలో ఉన్నారని, మన సంఘం తరపున ఏ ప్రాతినిధ్యం చేసినప్పటికీ అధికారులు, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మన ప్రాతినిధ్యానికి అనుకూలంగా జీవోలు ఇస్తున్నారని ఈ విధంగా ఉపాధ్యాయ సేవ చేసే అవకాశం పి.ఆర్.టి.యు. తెలంగాణ నాయకులకే సాధ్యం అని అన్నారు. ఆ క్రెడిట్ మన సంఘం నాయకులు అందరికీ దక్కుతుందని పేర్కొన్నారు. పి.ఆర్.టి.యు.తెలంగాణ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కటుకం మధూకర్ సేవలను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు.
ఎన్నో సంఘాలు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి వ్యక్తిగతమైన ప్రయోజనాల కొరకు ప్రాతినిధ్యం వహించినా, ఈ సంఘము వ్యక్తిగతమైన ప్రయోజనాలు ఆలోచించకుండా ఉపాధ్యాయ లోకానికి లబ్ధి చేకూరే విధంగా సూచనలు చేస్తున్నామని తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రంలో జిల్లా జోనల్ మల్టీ జోనల్ ఏర్పాటు మరియు ఉపాధ్యాయుల పోస్టులను ఆర్గనైజ్ చేస్తూ 255, 256, 257 జీవోలను విడుదల చేయడంలో మన సంఘం శాస్త్రీయంగా ఆలోచించి ప్రాతినిధ్యం చేసిందని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఉపాధ్యాయ సమస్యలను మరియు వాటి యొక్క పరిష్కారాలు సంబంధించిన సమీక్షలను ఎక్కడికక్కడ నిర్వహిస్తూ, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ఉపాధ్యాయులకు అనుకూలంగా ప్రభుత్వం చేత జీవోలు ఇప్పించడం జరుగుతుందని పేర్కొన్నారు.
ప్రపంచ తెలుగు మహాసభలలో భాషా పండితులను అప్ గ్రేడ్ చేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించినందున దానికి సంబంధించిన అంశాలను ముందుకు తీసుకెళ్లడం లో భాగంగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో, పదోన్నతులు కావాలని భాషా పండితులు కోరడం తదితర పర్యవసానాలు, కోర్టు కేసుల వలన జాప్యం జరుగుతుందని ఆయన అన్నారు.
రేషనలైజేషన్ తక్షణమే చేపట్టడం వలన కొన్ని జిల్లాలలో ఒక్క పోస్టు కూడా మిగలటం లేదని దీని ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చే అవకాశాలు ఉన్నందున వెనుకబడిన జిల్లాల స్థానిక అభ్యర్థులకు లబ్ధి చేకూరుతుందని, జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయుల పోస్ట్ మల్టీ జోన్ పోస్ట్ గా ఆర్గనైజ్ చేయడం ద్వారా ఎంతోమంది ప్రధానోపాధ్యాయులకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఉపాధ్యాయ వర్గానికి ఇంకా ఎన్నో ప్రయోజనాలు చేకూర్చే విధంగా పి.ఆర్.టి.యు. తెలంగాణ పనిచేస్తుందని తెలియజేశాడు.
పి.ఆర్.టి.యు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అంజిరెడ్డి చెన్నయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి పర్వతి సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా సంఘాలకు అతీతంగా ఉపాధ్యాయులకు ఏ సమస్యలు వచ్చినప్పటికీ మన సంఘం తరఫున ప్రాతినిధ్యం చేస్తూ, ప్రభుత్వం ద్వారా అందరికీ లబ్ధి చేకూర్చే విధంగా ప్రయత్నం చేస్తున్నది పేర్కొన్నారు.
కొమురం భీం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు రాష్ట్ర జిల్లా నాయకులు మారుమూల పల్లెల్లో ఉన్న ఉపాధ్యాయులకు సైతం ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే స్పందిస్తూ వారికి అండగా నిలబడుతున్నారు అని వారిని ప్రశంసించారు.
జిల్లా నూతన కమిటీ ప్రకటన..
జిల్లా అద్యక్ష ప్రధాన కార్యదర్శులు గా రెండవసారి కూడా పర్వతి రాజేశ్వర్ మరియు జాదవ్ శ్రీకాంత్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అని ప్రకటించారు.
ఈ కార్యక్రమం లో మంచిర్యాల జిల్లా అద్యక్ష ప్రధాన కార్యదర్శులు ధరణి కోట వేణుగోపాల్, సూరినేని గంగాధర్, ఆదిలాబాద్ జిల్లా అద్యక్ష ప్రధాన కార్యదర్శులు సునీల్ చౌవ్హాన్, నూర్ సింగ్, రాష్ట్ర, జిల్లా నాయకులు కటుకం మధూకర్, చైతన్య, సాగర్, సాంబయ్య, కె రంగయ్య, సుధాకర్, గోపికిరణ్, స్వామి, శ్యాంసుందర్, సుధాకర్, అరవింద్, గోపాల్, బి. కైలాస్ , బి. వినోద్ కుమార్, ఎ.చంద్రశేఖర్, జాడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Excellent blog here! Also your web site loads up very fast!
What host are you using? Can I get your affiliate link to your host?
I wish my site loaded up as quickly as yours lol
Visit my homepage … jasa pembuatan company profile, Marsha,
Pretty! This was an extremely wonderful article. Many thanks for supplying these details.
I really like what you guys are usually up too.
This sort of clever work and coverage! Keep up the superb works guys I’ve added you guys
to our blogroll.
My homepage – jasa social media marketing (agustinlia21.blogspot.com)
Hi there! I know this is kind of off topic but I was wondering which blog platform are
you using for this website? I’m getting sick and tired of WordPress because I’ve had issues with hackers and I’m looking at
options for another platform. I would be fantastic if you could point me in the direction of a good platform.
Here is my web blog … jasa foto ibu hamil jakarta
This is a topic that’s close to my heart… Thank you!
Exactly where are your contact details though?
Feel free to visit my web page … jasa desain company profile (winstarlink.com)