ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి: మంత్రి కొప్పుల ఈశ్వర్

• గ్రామాభివృద్దికి పటిష్ట చర్యలు చేపట్టాలి
• 3.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మద్దతు ధర పై కోనుగోలు
• మిషన్ భగీరథ పెండింగ్ పనులు పూర్తి చేయాలి
• *రైతు బంధు, రైతు భీమా వంటి సంక్షేమ పథకాలు అమలు
• హరితహారం కింద లక్ష్యాల మేరకు మొక్కలు నాటి సంరక్షించాలి
• రామగుండం ప్రాంతంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించాలి
• పల్లెప్రగతి పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
• పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమంలో స్థానిక కమిటిలను భాగస్వామ్యం చేయాలి
• సర్వసభ్య సమావేశంలో లేవనెత్తిన అంశాల పై అధికారులు సమాధానం అందించాలి
• ఎన్టిపిసి మిలినియం హల్ లో నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సంక్షేమ శాఖ మంత్రి
పెద్దపల్లి (CLiC2NEWS) : ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొని వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్టిపిసిలోని మిలినియం హల్ లో శనివారం జడ్పీ చైర్ పర్సన్ పుట్ట మధూకర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లాప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ విప్ తో కలిసి మంత్రి పాల్గొన్నారు. కరోనా రెండవ దశ వ్యాప్తి నేపధ్యంలో గత సంవత్సరం లాగే రైతులకు అండగా ఉండే విధంగా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 57,494 మంది రైతుల నుంచి రూ.678.08 కోట్ల విలువ గల 3.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మద్దతు ధర పై కోనుగోలు చేసామని మంత్రి తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పెద్ద ఎత్తున ధాన్యం కోనుగొలు చేస్తున్నప్పటికి కొన్నీ ఫిర్యాదులు అందుతున్నాయని, వాటి పై విచారించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.
అనంతరం జిల్లాలో త్రాగు నీటి సరఫరా అంశం పై మంత్రి చర్చించారు. మిషన్ భగీరథ పెండింగ్ పనులు పూర్తి చేయాలని, దానికి అవసరమైన నిధులు సైతం వెంటనే అందిస్తామని తెలిపారు. జిల్లాలో అటవీ భూములు, రెవెన్యూ భూములకు మరియు అటవీ భూములు, ప్రైవేటు భూముల మధ్య ఉన్న వివాదాల పై నివేదిక సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు జిల్లా యంత్రాంగం అందించే నివేదిక ఆధారంగా జాయింట్ సర్వే చేపట్టే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని కరోనా సంక్షోభ సమయంలో సైతం రైతులకు వానాకాలం రైతు బంధు నిధులను రూ.137.09 కోట్లు విడుదల చేసామని మంత్రి తెలిపారు. జిల్లాలోని గ్రామాలో పల్లె ప్రగతి పెండింగ్ పనులు త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకోవాలని, గ్రామాలను హరిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. పారిశుద్ద్య నిర్వహణ పై అధిక శ్రద్ద వహించాలని సూచించారు. గ్రామాలో పచ్చదనం పెంపొందించే దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు 150 కోట్లకు పైగా మొక్కలను నాటామని, 3 శాతం మేర గ్రీన్ కవర్ వృద్ది చేసుకున్నామని మంత్రి తెలిపారు.

హరితహారం కింద నాటే మొక్కల సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రామగుండం ప్రాంతంలో అధికంగా పరిశ్రమలు ఉన్నాయని, వాటి వల్ల కాలుష్యం అధికమవుతున్నందున పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి సూచించారు సింగరేణీ పరిశ్రమకు అధిక మొత్తంలో మొక్కల నాటి, వాటి సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, 100 శాతం మొక్కల సంరక్షణ జరిగే విధంగా కార్యచరణ రుపొందించి అమలు చేయాలని మంత్రి ఆదేశించారు.
రామగుండం ప్రాంతంలో ఉన్న గోదావరి నదీ ప్రవాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున మొక్కలు పెంచే విధంగా ప్రణాళిక తయారు చేసుకోవాలని, అక్కడ ఉన్న పిచ్చి మొక్కలను ఫిబ్రవరి మాసం నుంచి తొలగించాలని, వచ్చే సంవత్సరం అక్కడ లక్షల మొక్కలు నాటేవిధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. గ్రామాలో కనీస అవసరాలు అందించే దిశగా స్మశానవాటిక, డంపింగ్ యార్డు, ట్రాక్టర్, నర్సరీ వంటివి సమకూర్చుకున్నామని మంత్రి తెలిపారు. గతంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పెండింగ్ ఉన్న పనులు ప్రస్తుతం పూర్తి చేయాలని మంత్రి సూచించారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న 6 స్మశానవాటిక నిర్మాణ పనులకు ప్రత్యాహ్నమయ ప్రణాళిక రుపొందించి పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. గ్రామాలో పూర్తి స్థాయిలో విద్యత్ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రణాళిక సిద్దం చేసుకోవాలని, ఇంటి పై నుండి వెళ్లే హై టెన్షన్ వైర్లు తొలగించే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. హరితహారం, పల్లెప్రగతి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విజయవంతం చేసేందుకు స్థానిక కమిటిలను భాగస్వామ్యం చేయాలని మంత్రి సూచించారు ప్రజాభాగస్వామ్యంతో మాత్రమే ఆదర్శ గ్రామాలను తయారు చేయవచ్చని మంత్రి తెలిపారు. దళితుల కోసం సీఎం కేసిఆర్ ప్రత్యేకంగా దళిత సాధికారత పథకాన్ని ప్రారంభించారని, వచ్చే సంవత్సరం లబ్దిదారుల సంఖ్య సైతం గణనీయంగా పెంచే విధంగా బడ్జెట్ లో కేటాయింపులు చేసుకుందామని సీపం తెలిపారని, దాని కోసం సీఎం కృతజ్ఞతలు తెలుపుతూ సభ తీర్మానం చేసింది.
సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ సర్వ సభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు సూచించిన అంశాల పై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, దానికి సంబంధించిన సమాచారం సదరు ప్రజాప్రతినిధులకు అందించాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యాల సాధనకు ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
సమావేశంలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ మాట్లాడుతూ గ్రామాభివృద్దికి పటిష్ట చర్యలు చేపడుతున్న ప్రభుత్వానికి స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని తెలిపారు. మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా చేపట్టాలని, మన పరిసరాలను మనమందరం పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రభుత్వ విప్ మరియు ఎమ్మేల్సీ టి.భానుప్రసాద్ రావు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) కుమార్ దీపక్, జిల్లా అధికారులు జెడ్పీటీసీలు, ఎంపీపీలు ,సంబంధిత అధికారులు తదితరులు, ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.