అవసరమైతే నైట్ కర్ఫ్యూ పెట్టండి.. రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ

ఢిల్లీ(CLiC2NEWS) :దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాష్ట్రాల సిఎస్‌లకు లేఖ రాశారు. కొవిడ్ నిబంధనలు కట్టుదిట్టం చేయాలని, గత రెండు వారాలుగా 27 జిల్లాలలో కొవిడ్ పాజిటివిటి రేటు పెరుగుతోందని, వాటిపై దృష్టి పెట్టాలని కేంద్ర లేఖలో పేర్కొంది. కేరళ, మిజోరం, సిక్కిం రాష్ట్రాలలోని 8 జిల్లాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 10% కంటే ఎక్కువగా నమోదైన విషయం తెలిపింది. ఎక్కడ కరోనా వ్యాప్తి ఎక్కెవైనట్లు కనిపించిన నిర్లక్ష్యం వద్దని, వెంటనే కరోనా కట్టడి చర్యలు ప్రారంభించాలని సూచించింది. వ్యాక్సినేషన్ పెంచాలని అవసరమైతే నైట్ కర్ఫ్యూను విధించాలని లేఖలో పేర్కొన్నారు. పండుగలు, పెళ్లిళ్లు, అంత్యక్రియలకు పాల్గొనే వారిపై పరిమితులు విధించాలని సూచించింది. తాజాగా ఢిల్లీలో ఒమిక్రాన్ వేరియంట్ రెండో పాజిటివ్ కేసు నమోదయింది. దీంతో దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 33కు చేరింది.