Putta Madhuను ఇంటికి పంపిన పోలీసులు
హైదరాబాద్ (CLiC2NEWS): పెద్దపల్లి పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టమధును పోలీసులు ఇంటికి పంపేశారు. వారం రోజుల అదృశ్యం తర్వాత మూడు రోజుల కిందట రామగుండం పోలీసులు మదును అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
హైకోర్టు న్యాయవాది వామన్రావు దంపతుల హత్యపై పోలీసులు లోతుగా విచారించారు. నిన్న రామగుండం కమిషనరేట్లో పుట్ట మధు, ఆయన భార్య శైలజతో పాటు మధుకు సన్నిహితుడిగా పేరున్న కమాన్పూర్ వ్యవసాయ కమిటీ ఛైర్మన్ వూదరి సత్యనారాయణను అధికారులు రోజంతా వివిధ కోణాల్లో ప్రశ్నించారు. అర్థరాత్రి తర్వాత మధును ఇంటికి పంపిన పోలీసులు విచారణకు ఇవాళ కూడా హాజరు కావాలని ఆదేశించారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అయితే పుట్ట మధును రెండు రోజులకు పైగా విచారించినా బలమైన సాక్ష్యాలు ఏవీ బయటకు రాలేదని సమాచారం. రెండు కోట్ల లావాదేవీలకు సంబంధించి ఎక్కడా కూడా ఆధారాలు లభించలేదని తెలుస్తోంది.
హత్యకు ముందు, తరువాత జరిగిన ఫోన్ కాల్డాటాతో పాటు ఆర్థిక లావాదేవీల పైనే పోలీసులు ఆరా తీసినట్లు సమాచారం.