పెన్ను కోసం గొడవ.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
నరసరావు పేట (CLiC2NEWS): ఇద్దరు స్నేహితుల మధ్య పెన్నుకోసం గొడవ. ఈ చిన్న వివాదం నేపథ్యంలో ఓ విద్యార్థిని భవనంపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం.. ఈ ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో చోటుచేసుకంది. బొల్లాపల్లి మండలం, వెల్లటూరుకు చెందిన జెట్టి అనూష నరసరావుపేటలోని ప్రైవేటు కళాశాల హాస్టల్ లో ఉంటూ ఇంటర్ ప్రథమ సంవత్సరం చుదువుతోంది. శనివారం తన స్నేహితురాలితో పెన్నుకోసం గొడవ జరిగింది.దీంతో మనస్తాపానికి గురైన అనూష హాస్టల్ భవనం నాలుగో అంతస్థనుండి దూకింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.