Raghurama: మరికాసేపట్లో వైద్య ప‌రీక్ష‌లు

హైదరాబాద్ (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎంపి రఘురామకృష్ణంరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో మరికాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు నిన్న (సోమవారం) రాత్రి ఆయ‌న‌ను గుంటూరు జైలు నుంచి సికింద్రాబాద్​ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. మరికాసేపట్లో ముగ్గురు ఆర్మీ డాక్టర్ల నేతృత్వంలో.. ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. ఆస్పత్రి వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

జ్యూడిషియ‌ల్ అధికారిని నియ‌మించిన తెలంగాణ హైకోర్టు
సుప్రీంకోర్టు ఆఏశాల మేర‌కు రఘురామకృష్ణ వైద్య పరీక్షల పర్యవేక్షణకు తెలంగాణ హైకోర్టు జ్యుడీషియల్ అధికారిని నియమించింది. వైద్య పరీక్షలను డాక్టర్లు వీడియోగ్రఫీ చేయనున్నారు. జ్యుడీషియల్ అధికారి షీల్డ్ కవర్​లో నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించనున్నారు. చికిత్స కాలాన్ని జ్యుడీషియల్ కస్టడీగా భావించాలని సుప్రీం తెలిపింది. మరోవైపు.. విచారణ పేరుతో.. ముసుగు వేసుకొని కొందరు దారుణంగా కొట్టారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.