టిడిపి-జనసేన పార్టి కూటమి రాష్ట్రంలో చరిత్రను సృష్టిస్తుంది: రాఘురామ

తాడేపల్లిగూడెం (CLiC2NEWS): రానున్న ఎన్నికల్లో టిడిపి-జనసేన కూటమి తరపునే నరసాపురం నుండి ఎంపిగా పోటీ చేస్తానని రఘురామ కృష్టంరాజు ప్రకటించారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన తెలుగు జన విజయకేతనం జెండా బహిరంగ సభలో పాల్గొన్న రఘురామ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తిని చరిత్రపుటల్లో కలిపే సమయం వచ్చిందని.. ఈ కూటమి రాష్ట్రంలో చరిత్రను సృష్టిస్తుందని ఆయన అన్నారు. ఏ పార్టిలో చేరనప్పటికి ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించడం కోసం ఒక్కటైన టిడిపి-జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ను అభినందించడానికే.. వారి ఉమ్మడి సభకు వచ్చినట్లు రఘురామ తెలిపారు.