వయనాడ్, రాయ్‌బరేలీలో రాహుల్ విజయం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు చోట్లా విజయం సాధించారు. ఆయన కేరళలోని వయనాడ్ నుంచి, అలాగే యూపిలో రాయ్ బరేలీ నుంచి విజయం సాధించారు. వయనాడ్‌లో తన సమీప ప్రత్యర్థి సిపైఐ అభ్యర్థి యానీ రాజాపై 3.5 లక్షలకుపైగా మెజారిటీతో ఆయన రెండో సారి గెలుపొందారు.
అటు యుపిలోని రాయ్ బరేలీ నుంచి 3.7 లక్షలకు పై చిలుకు మెజారిటీతో జయకేతనం ఎగురవేసింది. రాయ్ బరేలీ కాంగ్రెస్ కంచుకోటఅన్న విషయం తెలిసిందే.