తెలంగాణలో మూడు రోజుల పాటు వర్ష సూచన..

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాగతల మూడు రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షలు కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. నైరుతి రుతుపవనాలు ఇవాళ దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య , తూర్పు మధ్య అరేబియా సముద్రంతో పాటు కొన్ని ప్రాంతాలకు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు , గోవా అంతటా, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు, పశ్చిమ మధ్య , ఉత్తర బంగాళా ఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు, మిజోరాం లోని కొన్ని ప్రాంతాలకు మణిపూర్ , నాగాలాండ్ లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాలు విస్తరించినట్లు సమాచారం. దీంతో రాబోయే 24 గంటల్లో నెమ్మదిగా తూర్పు వైపునకు కదిలి క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటనలో తెలిపింది.