హైదరాబాద్‌లో వర్షం
![](https://clic2news.com/wp-content/uploads/2021/04/rain-hyd.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): రాజధానిలో శుక్రవారం ఉదయం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గత రెండు, మూడు రోజుల నుంచి హైదరాబాద్లో ఎండ తీవ్రత పెరిగింది. ఇవాళ ఉదయం నుంచి వాతావరణం చల్లబడి ఉంది. అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్, ఫతేనగర్, బాలానగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, జీడిమెట్ల, బోయిన్‌పల్లి, కొంపల్లితో పాటు పలు ఏరియాల్లో వర్షం కురిసింది.