సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సు 61 ఏళ్ల కు పెంపునకు సిఎం సానుకూలం
ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కోరిన కార్మిక సంఘం ప్రతినిధులు, ఎమ్మెల్యే, ఎంపీలు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును కూడా 61 ఏళ్లకు పెంచాలని కోరుతూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఈకార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రతినిధులు, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యే, ఎంపీలు ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. వారి వినతిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు నాయకులు.