‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోలో ముఖ్య అతిథిగా రామ్ చరణ్

న్యూయార్క్ (CLiC2NEWS): మెగాస్టార్ రామ్‌చరణ్.. అమెరికాలో ప్రముఖ టివి (Good morning America) షోలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నమొదటి తెలుగు నటుడు రామ్‌చరణ్. ఆయన అమెరికాలోని హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొనేందుకు న్యూయార్క్ వెళ్లారు. ఈ కార్యక్రమంలో రామ్‌చరణ్ చేతుల మీదుగా ఒకరికి అవార్డు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఈ హెచ్ సిఎ ఫిల్మ్ అవార్డ్స్ 2023 ఫైనల్ నామినేషన్‌లో నాలుగు విభాగాల్లో చోటు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.