మొదలైన పాన్ ఇండియా రామ్ చరణ్- శంకర్ సినిమా

హైదరాబాద్ (CLiC2NEWS): మొదలైన పాన్ ఇండియా రామ్ చరణ్- శంకర్ సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమా పూజా కార్యక్రమం బుధవారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతోపాటు మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళి, బాలీవుడ్ స్టార్‌హీరో రణ్‌వీర్ సింగ్ ఈ వేడుకలో పాల్గొని టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ముహూర్తపు షాట్‌లో మెగాస్టార్ చిరంజీవి తన తనయుడు రామ్‌చరణ్‌పై క్లాప్ కొట్టారు.
భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో చరణ్ ప్రభుత్వాధికారి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. చరణ్‌కు జోడీగా కియారా నటించనున్నారు. మిగతా ముఖ్యపాత్రల్లో అంజలి, జయం రవి, శ్రీకాంత్, సునీల్ నటించనున్నారు. తమన్ స్వరాలు అందించనున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
First Clap done by MEGA STAR For #RC15 🔥#RC15Begins @AlwaysRamCharan pic.twitter.com/qtkH12TUt3
— RamCharan Addicts™ (@FansOfRamCharan) September 8, 2021
Wow, incredible weblog format! How long have you ever been running a blog for? you make running a blog glance easy. The entire look of your website is excellent, as neatly as the content!!