ఉపవాసాల పుణ్యఫలం ..

హద్దులేని ప్రతిఫలం

మహాప్రవక్త ముహమ్మద్ (సఆసం ) ఇలా ఉపదేశించినారు. హాజ్రత్ అబూహురైరా (రజీ ) ప్రవచించారు.

`అదం సంతానం యొక్క ప్రతి ఆచరణకు అనేక రేట్లు పుణ్యం లభిస్తుంది. ఒక్కో సత్కార్యానికి పది రెట్ల నుండి ఏడు వందల రెట్ల వరకు పెంచటం జరుగుతుంది. కానీ దేవుడు “రోజా వాటికీ భిన్నమైనది. అది కేవలం నా కోసమే. కాబట్టి దాని ప్రతిఫలం స్వయంగా నేనే ఇస్తాను”అంటున్నాడు. ఉపవాసం ఉన్నవారు తన మనోవాంఛలను, తన అన్నపానియాలను నా కోసమే వదిలి వేస్తాడు. ఉపవాసనికి రెండు సందర్భాలలో అమితమైన ఆనందం కలుగుతుంది.

ఒకటి రోజా విరమణ స‌మ‌యంలో..

రెండోది… తన ప్రభువును కలుసుకున్న సమయంలో.. ఉపవాసి నోటినుండి విలువడే వాసన దైవం దృష్టిలో కస్తూరి సువాసన కన్నా ప్రియమైనది.

రోజా డాలు (కవచం )లాంటిది. ఎవరైనా ఉపవాసం పాటిస్తున్నట్లయితే వారు నోటితో అశ్లీల పలుకులు పలకకూడదు.కయ్యాలకు కాలుదువ్వకూడదు. ఒకవేళ ఎవరైనా అతన్ని తిట్టినా, అతడితో జగడానికి దిగినా, బాబు నేను ఉపవాసంలో పాటిస్తున్నాను, అని చెప్పాలి. (ముత్తఫకున్ )
ఇక్కడ ఇతర సత్కార్యాలు పది నుండి ఏడోందల రేట్లు పెంచబడతాయని చెప్పటం జరిగింది. కానీ రోజా విషయంలో అది కేవలం తన కోసమే కనుక దాని ప్రతిఫలం స్వయంగా తానే తన దాసునికిస్తాను అంటున్నాడు దేవుడు.
అంటే ఒక్క రోజా తప్ప మిగతా సత్కార్యాలన్నీ దైవం కోసం కాదు. కాబట్టి దాని పుణ్యఫలం కూడా దైవం ఇవ్వదని దీని అర్ధం కాదు.

అసలు అర్ధం ఏమిటంటే, దైవవాక్కు ప్రకారం.. రోజా కేవలం దైవానికి మాత్రమే ప్రత్యేకం. దానికి బహుమానంగా దేవుడు తాను కోరినంత ప్రసాదిస్తాడు. ఇతర సత్కార్యాల విషయంలో పది నుండి ఏడు వందల రేట్లు అని ఒక పరిమితి వుంది. కానీ రోజా విషయంలో ఆలా లేదు. రోజా ప్రతిఫలం దాసునికి స్వయంగా తానే ఇస్తానంటున్నాడు. అంటే రోజాకు ఒక పరిధి అనేది లేదు. అల్లాహుతఆలా ఎంత ఇవ్వదలచుకుంటే అంత ఇస్తాడు.

–షేక్.బహర్ అలీ
యోగచార్యుడు, ఆయుర్వేద వైద్యుడు
సెల్‌: 73961 26557

 

Leave A Reply

Your email address will not be published.