రామ‌గుండం -3 సింగ‌రేణి బొగ్గు గ‌నిలో మ‌రోప్ర‌మాదం

గోదావ‌రిఖ‌ని (CLiC2NEWS): పెద్ద‌ప‌ల్లి జిల్లా రామ‌గుండం -3 ప‌రిధిలోని ఆడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు భూగ‌ర్భ గ‌నిలో శ‌నివారం మ‌రో ప్ర‌మాదం జ‌రిగింది. ఈనెల 7వ తేదీన జ‌రిగిన ప్ర‌మాదంలో ముగ్గురు మ‌ర‌ణించిన ఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే మ‌రో ప్ర‌మాదం చోటుచేసుకుంది. విధులు నిర్వ‌హిస్తున్న సింగ‌రేణి కార్మికుడు రియాజుద్దీన్‌పూ బొగ్గు పెళ్ల ప‌డింది. ఈఘ‌ట‌న‌లో రియాజుద్దీన్ మెడ‌పై గాయాల‌య్యాయి. బాధితుడిని వెంట‌నే గోదావిర‌ఖ‌నిలోని సింగ‌రేణి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Leave A Reply

Your email address will not be published.