Ramagundam: ఘనంగా సిఎం కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు
వినూత్నంగా నిర్వహించిన పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి
రామగుండం (CLiC2NEWS): తెలంగాణ ముఖ్యమంత్రి, బిఆర్ ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు పుట్టినరోజు (ఫిబ్రవరి 17)వేడుకను ఒకరోజు ముందుగా గురువారం లింగాపూర్ గ్రామంలో పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి ఘనంగా నిర్వహించారు. ఒక రోజు ముందుగా ఏర్పాటు చేసిన ఈ వేడుకను `ఊరంతా పండుగ` పేరుతో నిర్వహించి సిఎం కెసిఆర్ పైన అభిమానాన్ని చాటుకున్నారు, ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరు ఏకమై సుమారు 20,000 బెలూన్లను గాలిలో ఎగరవేశారు. ఈ బెలూన్లతో పాటు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలని సూచిస్తూ భారీ ఫ్లెక్సీలు నింగిలోకి ఎగరవేశారు.
ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
“పోరాటాల గడ్డపైన ఉద్భవించిన వీరపుత్రుడు.. స్వరాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ వీరుడు.. బంగారు తెలంగాణ కోసం పాటుపడుతూనే.. భారత భవిష్యత్తుని తీర్చిదిద్దుటకి కంకణం కట్టుకున్న కారణజన్ముడు గా సిఎం కెసిఆర్..“ అని పేర్కొన్నారు. భవిష్యత్తులో తప్పకుండా భారత దేశానికి కే.సి.ఆర్ వల్ల, బి.ఆర్.ఎస్ పార్టీ వల్ల మంచిరోజులు వస్తాయని అన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయి పంచారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శంకరమ్మ, సుగుణ, సువర్ణ,లలిత,బుచ్చమ్మ,హర్ష,వెంకటేష్, శేఖర్, లక్ష్మణ్, సాయి,నర్సమ్మ, సరిత,రమ,రాజమ్మ, మహేష్,తదితరులతో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.