Bhupalpally: ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులపై ప్రత్యేక నిఘా..

భూపాలపల్లి (CLiC2NEWS): జిల్లా కేంద్రంలో అంతర్ రాష్ట్ర సరిహద్దు పోలీసు అధికారుల సమావేశం నిర్వ‌హించారు. రాబోయే  అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని తెలంగాణ, ఛత్తీస్గడ్, మహారాష్ట్ర పోలీసు అధికారులు నిర్ణయించారు. మావోయిస్టుల కదలికలు, సరిహాద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి త‌గు సూచ‌న‌లు చేశారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జెన్కో కాన్ఫరెన్స్ హాల్లో  శుక్ర‌వారం జిల్లా ఎస్పి శ్రీ పుల్లా కరుణాకర్ ఆధ్వర్యంలో మహారాష్ట్ర చతిస్గడ్, తెలంగాణా రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల (గడ్చిరోలి, బీజాపూర్ తెలంగాణ వివిధ జిల్లాల పోలీసు అధికారులు) సమన్వయ సమావేశం, అంతర్ జిల్లా పోలీసు ఉన్నతాధికారుల స‌మావేశం జ‌రిగింది. సమావేశానికి రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి అధ్యక్షత వహించారు.

 

ఈ సందర్బంగా డిఐజి, రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాల‌ పోలీసు అధికారులను ఉద్దేశించి.. త్వరలో తెలంగాణ రాష్ట్రం లో జరుగబోయే ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర ల సరిహద్దులో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయటం తో పాటు మద్యం, డబ్బు ఇతర ఇల్లీగల్ కు సంబందించి అక్రమ రవాణా జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టేలా చర్యలతో పాటు,సరిహద్దు గుండా అక్రమ మద్యం, మహారాష్ట్ర దేశీదారు, గంజాయి మొదలైన వాటి రవాణా నియంత్రించడం మరియు ఎలా నియంత్రించాలి, నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పనిచేయాలన్నారు. అలాగే మూడు రాష్ట్రల పోలీసులు పరస్పరం సమాచార వ్యవస్థను సమన్వయం చేసుకొంటూ సాఫీగా ఎన్నికలు సాగేలా చూడాలని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ పుల్లా కరుణాకర్, ములుగు ఎస్పీ శ్రీ గౌస్ ఆలం, కొమురం భీం ఆసిఫాబాద్ ఎస్పీ కే సురేష్ కుమార్, వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి పి రవీందర్, మంచిర్యాల్ సుధీర్ శ్రీ సుధీర్ ఆర్ కేకెన్, ములుగు ఓఎస్డి శ్రీ అశోక్ కుమార్, ఎస్పీ బీజాపూర్,, అడిషనల్ ఎస్పీ బీజాపూర్,, ఎస్పీ గడ్చిరోలి, డిఎస్పీ సిరోంచ, ఏసీపి హుజరాబాద్ జీవన్ రెడ్డి, భూపాలపల్లి కాటారం డిఎస్పీలు ఏ రాములు, జి రామ్మోహన్ రెడ్డి , మరియు మూడు రాష్ట్రాలకు చెందిన డీఎస్పీలు, సిఐలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.