సిఎం  పర్యటన.. పోలీస్ అధికారులతో స‌మీక్ష నిర్వ‌హించిన రామ‌గుండం సిపి

 

Ramgundam Police Commissionerate: ఈ నెల 4వ తేదీన‌  పెద్దపల్లిలో  సిఎం ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా  రామ‌గుండం క‌మిష‌న‌ర్ ఎం శ్రీ‌నివాస్ సిబ్బందితో స‌మీక్ష నిర్వ‌హించారు. ముఖ్య‌మంత్రి  పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, కార్యక్రమం సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు.

బందోబస్త్ ఏర్పాట్లు, పార్కింగ్ స్థలాలు, విఐపి లు వచ్చే మార్గాలు, ప్రవేశ మార్గాలు, సభకు వచ్చే ప్రజల రాకపోకల సౌకర్యాలు గురించి చ‌ర్చించారు. ట్రాఫిక్ మార్గ దర్శకాల ఫై, ప్రధాన రహదారులు, పార్కింగ్ ప్రత్యేక ప్రాంతాలు గుర్తింవు అనుగుణంగా ఏర్పాట్లు, వివిధ శాఖల సమన్వయం, అత్యవసర పరిస్థితిలలో అంబులెన్స్, ఫైర్ సర్వీస్ గురించి, బందోబస్త్ విధులకు సంబందించిన డ్యూటీ చార్ట్ స్పష్టంగా కేటాయింపు, స్పెషల్ టీమ్ ల ఏర్పాట్లు తదితర అంశాలఫై సమీక్షా సమావేశంలో అధికారులతో చర్చించారు. దీనికి సంబంధించి  సలహాలు, సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.