రికవరి చేసిన మొబైల్స్ ను బాధితులకు అప్పగించిన పోలీసులు

రామగుండం పోలీస్ కమిషనరేట్ (CLiC2NEWS): రామగుండం పోలీస్ కమిషనరేట్ వివిధ ప్రాంతాల‌లో  మొబైల్ ఫోన్‌లను పోగొట్టుకొన్న వారికి తిరిగి వారి మొబైల్స్‌ను అప్ప‌గించారు. ఆధాGFFFHర్ కార్డులు, సంబంధిత మొబైల్ ఫోన్ల IMEI నెంబర్లను CEIR PORTAL ద్వారా www.ceir.gov.in వెబ్సైటులోకి లాగిన్ అయి అప్లోడ్ చేయాగ CEIR వారు మొబైల్ ఫోన్లను బ్లాక్ చేసి ట్రెస్డ్ డీటైల్స్ లోకి వెళ్లి వారి మొబైల్స్ లలో SIM కార్డు వేసిన వారి వివరాలు తెలుసుకొని 5 ఫోన్ ల వివరాలు రామగుండం సైబర్ క్రైమ్ వారికీ తెలపారు. ఐటీ సెల్ వారు సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి వివరాలు అందించారు. వారి నుండి మొబైల్స్ ను రికవరీ చేశారు. ఆ ఫోన్ లను సోమ‌వారం రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి బాధితులకు అప్పగించారు.
ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ.. ప్రజలు ఎవరైనా తమ స్మార్ట్ ఫోన్‌ల‌ను పోగొట్టుకున్నట్లయితే వారు CEIR PORTAL ద్వారా www.ceir.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి అందులో పూర్తి వివరాలు పొందపర్చాలని.. త్వ‌ర‌గా వారి మొబైల్స్ లను పట్టుకోవడం జరుగుతుందన్నారు. కావున ప్రజలు ఈ CEIR అప్లికేషన్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమం లో పెద్దపల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్, పెద్దపల్లి ఎసిప ఎడ్ల మహేష్, జైపూర్ ఎసిపి నరేందర్, మంచిర్యాల ఎసిపి తిరుపతి రెడ్డి, బెల్లంపల్లి ఎసిపి సదయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.