Godavarikhani: అన్‌లైన్ మట్కా గేమ్ నడిపిస్తున్న వ్యక్తి అరెస్టు
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/RAMAGUNDAM-POLICE-COMMISIONERATE-1.jpg)
రామగుండం పోలీస్ కమిషనరేట్ (CLiC2NEWS): గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్‌నగర్‌లో ఓ ఇంటి వద్ద నుండి ఆన్లైన్ మట్కా గేమ్ నడిపిస్తున్ననాగ అక్షయ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి రూ. 16,071, రెండు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గత సంవత్సరం నుండి ప్రజలను మోసం చేస్తూ.. ఆన్‌లైన్‌లో మట్కా గేమ్ ఆడిపిస్తున్నాడు. కష్ట పడకుండా డబ్బులు సులభంగా సంపాదించవచ్చని ప్రజల నమ్మించి ఈ విధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్న అక్షయ్‌ను టాస్క్‌ఫోర్స్ అధికారులు సుధాకర్ సిబ్బందితో కలిసి అక్షయ్‌ను అరెస్టు చేశారు.