Ramagundam: ఆపరేషన్ ముస్కాన్- X నిర్వహణ పై సమీక్ష

బాల కార్మికుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు: సిపి శ్రీ‌నివాస్‌

రామగుండం పోలీస్ కమిషనరేట్:

బాల కార్మికుల సంర‌క్ష‌ణ‌కు చేప‌ట్టిన‌ ఆప‌రేష‌న్ ముస్కాన్ – గురించి రామగుండం పోలీస్ క‌మిష‌న‌ర్ ఎం.శ్రీ‌నివాస్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ నెల 1వ తేదీనుండి 31 వ తేదీ వర‌కు ఈ ఆప‌రేష‌న్ నిర్వ‌హించ‌నున్నారు. క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో నిర్వ‌హించిన ఈ స‌మావేశంలో పెద్ద‌ప‌ల్లి, మంచిర్యాల జిల్లాల ఆప‌రేష‌న్ ముస్కాన్ – టీమ్ పోలీస్ అధికారులు, సిబ్బంది, చైల్డ్ వెల్ఫేర్ క‌మిటి, లేబ‌ర్, ఎడ్యుకేష‌న్ , చైల్డ్ ప్రొటెక్ష‌న్, హెల్త్ డిపార్ట్‌మెంట్‌ల అధికారులు స‌మావేశ‌మ‌య్యారు.

ఈ సందర్భంగా  సిపి మాట్లాడుతూ….. గతంలో నమోదైన కేసుల డేటా ఆధారంగా పిల్లలు బాల కార్మికులగా పనిచేస్తున్న హాట్ స్పాట్స్ పై నిఘా ఉంచాల‌ని.. గతంలో రెస్క్యూ చేసిన పిల్లల యొక్క పరిస్థితి గురించి అడిగి తెలుసుకోవాల‌న్నారు. స్కూల్ డ్రాప్ అవుట్ పిల్లలను గుర్తించి వారిని మరల స్కూల్ లలో చేర్పించాల‌ని, అదేవిధంగా ఆరోగ్య పరిస్థితి బాగాలేని పిల్లల ను గుర్తించి వారిని సంబందిత హాస్పిటల్లో చేర్పించి పరిక్షలు నిర్వహించి, చికిత్స అందేలా చూడాలి. ప్రతి షాప్స్ వద్ద “No Child Labour are employed here” బోర్డ్స్ ఏర్పాటు చేపించాల‌న్నారు. బాల్య వివాహాల చేయడం నేరం. బాల్య వివాహలపై అవగాహన కల్పించాలి. 18 సంవత్సరాల లోపు బాలకార్మికులుగా పని చేస్తున్న పిల్లలు గొర్రెల, పశువుల కాపరులుగా, కిరాణం షాప్ లలో, మెకానిక్ షాపులలో, హోటళ్లలో, ఇటుక బట్టీలలో, పౌల్ట్రీ ఫామ్ లలొ పని చేసిన, పిల్లలు రోడ్డుపై భిక్షాటన చేస్తున్న, మరే ఇతర ప్రదేశాలలో తప్పిపోయిన, వదిలివేయబడిన పిల్లలు బాలకార్మికులుగా పని చేస్తున్నట్లయితే అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం, లేదా స్టేట్ హోమ్ కు పంపించడం చేయాలని అన్నారు వివిధ కారణాల వల్ల వారి కుటుంబాల నుండి విడిపోయిన తప్పిపోయిన మరియు గుర్తించబడని పిల్లలను గుర్తించడానికి “DARPHAN” అనే ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. చిన్న పిల్లలతో ఎవరైనా బలవంతంగా బిక్షాటన మరియు వెట్టి చాకిరీ చేయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకొంటామని, ఆపరేషన్ ముస్కాన్ -X లో భాగంగా బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రత్యేకంగా ప్రతి డివిజన్ పరిధిలో ఒక ఎస్ఐ మరియు నలుగురు సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలలో ఎవరైనా బాలకార్మికులను పనిలో పెట్టుకున్న, లేక వారితో బలవంతంగా పని చేయించిన, తప్పిపోయిన, వదిలివేయబడిన, హింసకు బెదిరింపులకు గురవుతున్న వీధి బాలలను చూసినప్పుడు, 1098 లేదా డయల్ 100, స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని సిపి సూచించారు.

Leave A Reply

Your email address will not be published.