చైనా మాంజా విక్రయించిన, వినియోగించిన చట్టపరమైన చర్యలు..
రామగుండం కమిషనరేట్: చైనా మాంజా నిషేధం
రామగుండం పోలీస్ కమీషనరేట్ (CLiC2NEWS): చట్ట విరుద్ధంగా చైనా మాంజా వినియోగిస్తే ఉపేక్షించేది లేదని రామగుండం సిపి శ్రీనివాస్ హెచ్చరించారు. రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఎవరైనా చైనా మంజా అమ్మిన, దాని వలన ఎవరికైనా ప్రమాదం జరిగిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ హెచ్చరించారు. సంక్రాంతి సందర్భంగా చైనా మాంజ ఎక్కువగా విక్రయించే దుకాణాల పై అధికారులు తనిఖీ లు నిర్వహించడం జరుగుతుందని ప్రకటన లో తెలిపారు. చైనా మాంజను ఉపయోగించి గాలి పటాలు ఎగురవేసే క్రమంలో ఎన్నో పక్షులు, సాధారణ ప్రజలు కూడా ప్రమాదానికి గురవుతారు. ఈ నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చైనా మంజా నిషేధించినట్లు తెలిపారు.
చైనా మాంజాపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం అమ్మినా, కొనుగోలు చేసినా నేరమేనని, చైనా మాంజాను అమ్మితే ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా కూడా వుంటుందని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో అన్ని ప్రాంతాల్లో చైనా మాంజా విక్రయాలు జరగకుండా తగు చర్యలు తీసుకొవడం జరుగుతొందని.. ప్రధానంగా ప్రజలు సైతం చైనా మాంజా వినియోగించకుండా ఎవరికి హాని కలగని సాధారణ దారంతో గాలిపటాలను ఎగురవేసుకోవాలన్నారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తున్న, వినియోగిస్తున్న డయల్ 100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి సిపి ప్రజలకు సూచించారు.