నీల్వాయి పోలీస్ ఆధ్వర్యంలో 25 మందికి కంటి శస్త్ర చికిత్స
చెన్నూర్ (CLiC2NEWS): పోలీస్ మీకోసంలో భాగంగా నీల్వాయి ప్రాంతంలో మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాలతో మావోయిస్టు ప్రభావిత ప్రాంత ప్రజల కోసం వేమన పల్లి మండలం లోని ఆశ్రమ పాఠశల వద్ద మెగా వైద్య శిబిరం నిర్వహించారు. దాదాపు 67 మంది కంటి సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించి వైద్యం అందించారు. వారిలో 25 మందిని చెన్నూర్ రూరల్ సిఐ సుధాకర్, నీల్వాయి ఎస్సై శ్యామ్ పటేల్ ఆధ్వర్యంలో చెన్నూర్ లోని కిరణ్ హాస్పిటల్ లో కంటి ఆపరేషన్ శిబిరానికి తరలించారు.
మిగిలిన వారికి మళ్ళీ తేది ప్రకటించి, కంటి ఆపరేషన్ చేయిస్తామని తెలిపారు. పోలీస్ వారు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటు చట్టపరిధిలో సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత, రక్షణకోసం పని చేస్తాం అని ఎస్ఐ తెలిపారు.