మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి : సిపి రెమా రాజేశ్వరి
రామగుండం పోలీస్ కమిషనరేట్ (CLiC2NEWS): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వేడుకలు పెద్దపల్లి పోలీస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీమతి రెమా రాజేశ్వరి, పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహన్ రెడ్డి, పెద్ద పల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్, మంచిర్యాల డిసిపి సుధీర్ రాంనాథ్ కేకన్, పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమత రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మహిళలు ఆత్మస్థైర్యంతో జీవితంలో ముందుకు సాగిపోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకోని పెద్దపెల్లి డిసిపి, సబ్ డివిజన్ పోలీస్ లకు, ముఖ్యంగా గౌరవనీయులు పెద్దపెల్లి ఎమ్మెల్యే గారికి ఇక్కడున్న మహిళలు ఆడపిల్లలు అందరు తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు తల్లితండ్రులను, టీచర్స్ ని ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకోవాలి అదే విధంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంత మంది మహిళలు ఈ కార్యక్రమం కి హాజరు కావడం చూస్తే ఈ ప్రాంత మహిళల్లో ఎంత చైతన్యం ఉందొ అర్థమవుతుందన్నారు. ఇబ్బందులెదురైతే ధైర్యంగా వాటిని అధిగమించాలి. మనకు ఆత్మవిశ్వాసం ఉం డాలి. దేన్నైనా ఎదుర్కొనే ధైర్యం తోనే ఎంతటి ఇబ్బం దులెదురైనా అధిగమించొచ్చు. అమ్మాయిలు ప్రలోభాలకు ఆకర్షణకు గురై భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. చదువుతోనే భవిష్యత్తు బాగుంటుంది ఉన్నత స్థానంలో ఉంటారు. ఇప్పుడు నేను ఇంత గర్వంగా ఇక్కడ మీ ముందు మాట్లాడగలుగుతున్నాఅంటే దానికి ప్రధాన కారణం చదివే. మహిళలు మహిళలకు తోడుగా ఉండాలి. ఈరోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం దీనికి ఇంత పెద్ద ఎత్తున సహకరించి ముందుకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన పెద్దపెల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్ పెద్దపల్లి ఏసిపి మహేష్ సబ్ డివిజన్ పోలీస్ అధికారులందరినీ సిపి అభినందించారు.
ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళ సాధికారతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. జిల్లా కేంద్రంలోని రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ మహిళల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ మహిళా గ్రూపులకు వడ్డీలేని రుణాలను మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్దపల్లి జిల్లాకు రూ.16 కోట్ల నిధుల కేటాయింపు చేశారన్నారు. ఉన్నత చదువులతో మహిళల ఆర్థిక ఎదుగుదల జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం మహిళా దినోత్సవ నిర్వహణతో చైతన్యం తీసుకువస్తుందని, మహిళలు వ్యాపార వాణిజ్య రాజకీయ రంగాలతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే చదువులో ముందుండాలని సూచించారు. మహిళల అభ్యున్నతి కోసం తోటి మహిళలంతా సహకరించి విజయాన్ని చేకూర్చాలని అన్నారు మహిళలకు చదువు శిరోభూషణం గా 100 ఆభరణాలతో అలంకరించిన సౌభాగ్యవతిగా నిలుపుతుందన్నారు. ఇంటి బాధ్యతలన్నీ చేపట్టి విద్యావంతులను చేసి కుటుంబాన్ని పోషించే మహిళగా ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. సృష్టికి మూలమైన అమ్మను అమ్మగా పూజించడం గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా ఈ సందర్భంగా గుర్తు చేశారు.