క్రీడాకారులకు ట్రాక్ సూట్స్ పంపిణి..

రామ‌గుండం పోలీస్ క‌మిష‌న‌రేట్‌ (CLiC2NEWS): రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనే వారికి  రామగుండం సిపి ట్రాక్ సూట్‌లను పంపిణీ చేశారు.  కరీంనగర్ లో జరిగే  తెలంగాణ రాష్ట్ర స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీలు కోసం కాళేశ్వరం జోన్ తరపున ప్రాతినిధ్యం వహించేందుకు క్రీడాకారులు ఎంపికైయ్యారు. వీరికి   రామగుండం పోలీస్ కమీషనర్  ఎం. శ్రీనివాస్  పోలీస్ అధికారులతో కలిసి ట్రాక్ సూట్స్ అందచేశారు. ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ.. ఈ క్రీడల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారులు తప్పకుండ నేను మెడల్ సదిస్తాను అనే బలమైన నమ్మకం పట్టుదలతో పోటిలలో పాల్గొనాలి అని సూచించారు.  కాళేశ్వరం జోన్ కు అత్యధిక పతకాలు సాధించి, మంచి పేరు తీసుకురావాలని  కోరారు.

ఈ కార్యక్రమం లో  పెద్దపల్లి డిసిపి చేతన్‌,  అడిషనల్ డిసిపి అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఎసిపి రాఘవేంద్ర రావు, ఏ ఆర్ ఎసిపి లు ప్రతాప్, సుందర్ రావు, ఆర్ఐ లు దామోదర్, శ్రీనివాస్, మల్లేశం, సంపత్, కాళేశ్వరం  జోన్ కి ఎంపికైన   క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.