బహిరంగ ప్రదేశాల్లో మద్యం, డీజే, డ్రోన్ లపై నిషేధాజ్ఞలు కొనసాగింపు..

సిటీ పోలీస్ యాక్ట్ అమలు

రామగుండము పోలీస్ కమీషనరేట్ (CLiC2NEWS): రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జోన్ లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, వారు పాల్పడుతున్న ఆగడాలపై ప్ర‌జ‌ల నుండి వ‌స్తున్న ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు స‌మాచారం. ఈ నిషేధాజ్ఞలు 01-04-2025 నుండి 01-05-2025 వరకు కొనసాగుతాయని తెలిపారు. పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఈ కాలం పరిమితి పొడిగించబడే అవకాశం ఉందని సిపి తెలిపారు. (భారతియ న్యాయ సంహిత) BNS 223, హైదరాబాద్ నగర పోలీసు చట్టం, 1348 ఫసలీ నిబంధనలను అనుసరించి నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి గారు హెచ్చరించారు

అదేవిధంగా డీజే ,డ్రోన్ లపై నిషేధాజ్ఞలు పొడిగించారు. శబ్ద కాలుష్యం నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు భారీ సౌండ్ లతో కూడిన డిజె సౌండ్ వినియోగం పై నిషేధాజ్ఞలు విధించారు. వివిధ కార్యక్రమాల సందర్బంగా ప్రజల సమీకరణ, ప్రదర్శనల కోసం డీజే సౌండ్ల్ వినియోగిస్తున్నారని అయితే వివిధ కార్యక్రమాల నిర్వహణకు మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అని అనిపిస్తే సంబంధిత డివిజన్ ఏసిపి ల అనుమతి పొందాలని సూచించారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ ల పరిధిలో రామగుండం పోలీస్ కమిషనరేట్ 7 (1), 2016, యాక్ట్, 22 (1) (a )నుండి (f ) మరియు 22 (2) (a) & ( b), & 22 (3) సిటీ పోలీస్ యాక్ట్, 1348 No IX ఫాస్లి సెక్షన్ 30 పోలీస్ యాక్టు 1861 ప్రకారం తేది 01-04-2025 ఉదయం 6:00 నుండి 01-05- 2025 ఉదయం 6 గంటల వరకు ఆమలులో వుంటుంది.

Leave A Reply

Your email address will not be published.