మంచిర్యాల: ఫోక్సో కేసులో నేరస్తునికి 2 ఏళ్ల జైలుశిక్ష
మంచిర్యాల (CLiC2NEWS): ఫోక్సో కేసులో గురువారం మంచిర్యాల కోర్టు నేరస్తునికి 2 సంత్సరాల జైలుశిక్ష, 3వేల జరిమానా విధించింది. మంచిర్యాల ఎన్టిఆర్ నగర్లో మైనర్ బాలికను ప్రేమ పేరుతో వెంటబడుతున్న రాజుకు అడిషనల్ డ్రిస్ట్రిక్ సెషన్ జడ్జి శిక్ష విధించారు. మైనర్ బాలికను తిట్టి, కొట్టాడని.. ప్రేమ పేరుతో వెంటబడుతున్నాడని బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజుపై కేసు నమోదు చేశారు. గురువారం కోర్టులో నేరం రుజువైనందున అతనికి 2 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఈ కేసులో నేరస్తునికి శిక్ష పడడానికి సహకరించిన వారికి రామగుండం కమిషనర్ రెమా రాజేశ్వరి అభినందనలు తెలియజేశారు.