యువత అభివృద్ధి మార్గం వైపు అడుగులు వేయాలి..

మంచిర్యాల (CLiC2NEWS): ఎటువంటి సహాయం కోసమైనా పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీమతి రెమారాజేశ్వరి అన్నారు. జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లి నగర్ గ్రామంలో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ‘పోలీస్ మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి , మంచిర్యాల డీసీపీ సుధీర్ రామనాథ్ కేకన్‌లు ముఖ్య అతిథులు గా హాజరైనారు. వీరికి సంప్రదాయ నృత్యం, డప్పు చప్పుళ్ల నడుమ గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సిపి రెమా రాజేశ్వరి మాట్లాడుతూ…. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా పోలీస్ మీకోసం కార్యక్రమం సందర్బంగా పోలీస్ శాఖ తరుపున ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మారు మూల గ్రామలైన అల్లి నగర్, దొంగపల్లి, మల్యాల, బొమ్మేనా, పైడి పల్లి గ్రామాలకు రావటం జరిగిందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల మంచి కొరకు గ్రామానిక వచ్చినట్లు తెలిపారు. ఈ గ్రామం లో చాలా మంది చదువుకొనే యువతీ యువకులు ఉన్నారు. మంచిగా చదువుకొవడానికి, ప్రభుత్వం ఉద్యోగం లేదా ఏదైనా మంచి ప్రవేట్ ఉద్యోగం సాధించడానికి పోలీస్ తరుపున మీకు కావలసిన సహాయ సహకారం అందిస్తామన్నారు. ఉద్యోగ పరంగా వాళ్ళకి కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ చదువుకోవడానికి వాళ్ళకి అవసరం ఉన్నటు వంటి సహాయం చేస్తాం కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేయించడం వాళ్లకి కోచింగ్ మెటీరియల్ తెప్పించడం జరుగుతుంది. పోలీస్ తరుపున సహాయ మీకేం కావాలో తెలియచేయాలనీ తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మమ్మల్ని మీరందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా చూసుకొని మీకు అవసరం ఉన్నటువంటి సహాయం మమ్మల్ని అడగాలి అన్నారు. మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం తరుపున చాలా పథకాలు అమలు చేస్తున్నదని వాటిని సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే పోలీస్ అధికారుల దృష్టి కి తీసుకువస్తే సంబందించిన ప్రభుత్వ శాఖల వారి తో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం అన్నారు.
ఈ సందర్భంగా గ్రామంలోని 300 మంది మహిళలకు చీరలను, యువకులకు వాలీ బాల్ కిట్స్ అందచేశారు. వారికి భోజనం ఏర్పాట్లు చేశారు. స్కూల్ కి వెళ్లే చిన్న పిల్లలకు షూస్, చెప్పులు లేకుండా ఉండడం గమనించిన సీపీ రెండు రోజులలో వారికి షూస్, చెప్పులు పంపిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసిపి తిరుపతి రెడ్డి, లక్షేట్టిపేట సీఐ కృష్ణ రెడ్డి, జన్నారం ఎస్సై సతీష్ , సర్పంచ్, ఎంపిపి, గ్రామ పటేల్, ప్రజా ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.