విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లను ద్వంసం చేసిన కేసులో నిందితులపై పీడీయాక్ట్

రామగుండం పోలీస్ కమిషనరేట్ (CLiC2NEWS): వ్యవసాయ విద్యుత్తు టాన్స్ ఫార్మర్స్ ధ్వంసం చేసి, వాటిలోని కాపర్ కాయిల్స్ దొంగిలించడం వంటి నేరాలకు పాల్పడుతున్న నిందితులపై రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి పిడి యాక్ట్ ఉత్తర్వులను జారీచేసినారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి, మంచిర్యాల మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలో వ్యవసాయ విద్యుత్తు టాన్స్ ఫార్మర్స్ ధ్వంసం చేసి, అందులోనున్న కాపర్ కాయిల్స్ దొంగిలించడం వంటి నేరాలకు పాల్పడిన మద్దిపల్లి సాయితేజ, దోనిపల్లి సురేష్, మీనుగు మల్లేష్, రేగుంట వర్ధన్, చిన్నకుర్తి రాకేష్, పులి భరద్వాజ్, మినుగు బానేష్ లపై పిడియాక్ట్ ఉత్తర్వులను మంథని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సతీష్ అందజేశారు. అనంతరం నిందితులను చర్లపల్లి కారాగారానికి తరలించారు.
పీడీ యాక్ట్ అందుకున్న నిందితుల పై గతం లో మంథని పోలీస్ స్టేషన్ పరిధిలో-09,చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో-06, జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో-06, భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో-02, కొయ్యురు పోలీస్ స్టేషన్ పరిధిలో-01, కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో-01, నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో-01, దండేపల్లి పోలీస్ పరిధిలో -02, కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో-01, కాలేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో-01, గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో-01, అంతర్గాం పోలీస్ స్టేషన్ పరిధిలో రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో-03, బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో -02, ఎన్టిపిసి పోలీస్ స్టేషన్ పరిధిలో-01, కమాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో -01 మొత్తం 41 కేసులు ఏడుగురుపై నమోదు చేయడం జరిగింది. ఈ కేసులలో మంథని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఈడీ డా.ఎం.సత్యనారాయణ, ఈఎన్సీ, ఆపరేషన్స్ డైరెక్టర్-1 అజ్మీరా కృష్ణ, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ అధ్యక్షుడు రాంబాబు యాదవ్, జనరల్ సెక్రటరీ జయరాజ్, మేవా అధ్యక్షుడు ఖాజా జవహర్ అలీ, జనరల్ సెక్రటరీ సయ్యద్ అక్తర్ అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్, సీజీఎం మహ్మద్ అబ్దుల్ ఖాదర్, నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.