మహిళా చట్టాలు, షి టీమ్స్‌లపై అవగాహన కార్యక్రమం
రామగుండం పోలీస్ కమిషనరేట్ (CLiC2NEWS): రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా సిసిసి నస్పూర్ లోని KGBV విద్యార్థినులకు మహిళ చట్టాలపై మరియు షీ టీమ్స్ లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల షిటీమ్స్ ఎస్ ఐ సౌమ్య రెడ్డి ఆధ్వర్యంలో రక్షణ, మరియు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్ఐ సౌమ్య రెడ్డి గారు మాట్లాడుతూ…. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు మరింత దగ్గరై సేవలు అందిస్తున్నామని ఏదైనా సమస్య ఉంటే *డయల్ 100* కాల్ చేయాలని తెలిపారు. స్థానిక పోలీస్ అధికారులకు గాని లేదా –హాక్ ఐ యాప్– ద్వారా తెలియజేయాలని, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ లైంగికంగా వేధించటం, వెంటబడటం వంటి దుశ్చర్యలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. లైంగిక వేధిస్తే ఎవరైనా భయపడకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, కొత్త వారిని గుడ్డిగా నమ్మవద్దని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలను ఇబ్బందులకు గురి చేసేవారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ర్యాగింగ్/ ఈవ్ టీజింగ్/పోక్సో/ బాల్య వివాహాలు/వరకట్నం చట్టాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో షీ టీమ్ సిబ్బంది, టీచర్స్ మరియు తదితరులు పాల్గొన్నారు.