రాష్ట్ర స్థాయి ఉత్తమ పోలీస్ డాగ్ ‘సింబా’..

రామగుండం పోలీస్ కమీషనరేట్ (CLiC2NEWS): రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ (Police Duty Meet-2025) లో  రామగుండం పోలీస్ కమీషనరేట్ నార్కోటిక్ డాగ్ ‘సింబా’ బంగారు పతకం సాధించింది. వరంగల్ జిల్లా మమునూరు పిటిసిలో  తెలంగాణ రాష్ట్ర రెండవ పోలీస్ డ్యూటీ మీట్ (Police Duty Meet) నిర్వ‌హించారు. దీనిలో కాళేశ్వరం జోన్ నుండి నార్కోటిక్ డాగ్ విభాగం పోటీలో పోలీసు జాగిలం సింబా, డాగ్ హ్యాండ్లర్ ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎం. వేణుగోపాల్ కృష్ణ పాల్గొన్నారు. గంజాయి, మత్తు పదార్థాలను గుర్తించడం లో పోలీసు జాగిలం సింబా, డాగ్ హ్యాండ్లర్  గోల్డ్ మెడల్ సాధించారు. అదే విధంగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పోలీస్ డాగ్ గా’ సింబా’ ఎంపికైంది. ఈ సంద‌ర్బంగా రామగుండం పోలీస్ కమీషనర్ (సిపి) అంబర్ కిషోర్ ఝా తమ కార్యాలయంలో నార్కోటిక్ డాగ్ సింబా, డాగ్ హాండ్లర్ ను అభినందించారు. 2026 సంవత్సరం ఫిబ్రవరిలో పూణేలో జరిగే నేషనల్ పోలీసు డ్యూటీ మీట్ లో పాల్గొని మరిన్ని పతకాలు సాధించాలన్నారు. తెలంగాణ రాష్ట్రానికి, రామగుండం పోలీస్ కమీషనరేట్ కి మంచి పేరు తీసుకు రావాల‌ని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి ఏ. భాస్కర్ ఐపీఎస్., పెద్దపల్లి డిసిపి పి. కరుణాకర్, ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్ ఏ ఆర్ ఏ సి పి ప్రతాప్, ఆర్ ఐ లు దామోదర్, శ్రీనివాస్, వామనమూర్తి సంపత్, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

త‌ప్ప‌క చ‌దవండి: బిఆర్ఎస్‌కి రాజీనామా చేసిన మాజి ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు

Leave A Reply

Your email address will not be published.