ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించ‌డంలో రిసెప్ష‌న్ అధికారి పాత్ర కీల‌క‌మైన‌ది: సిపి చంద్రశేఖర్

రామ‌గుండం పోలీస్ క‌మిష‌న‌రేట్‌ (CLiC2NEWS): ప్రజలకు సేవలు అందించడంలో రిసెప్షన్ అధికారి యొక్క పాత్ర కీలకమైనదని పోలీస్ కమీషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. రామగుండం పోలీస్ కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో మంగ‌ళ‌వారం పెద్దపల్లి మంచిర్యాల జోన్ ల లోని పోలీస్ స్టేషన్ ల రిసెప్షన్ అధికారులతో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ కు వివిధ రకాల అభ్యర్థనలు/ ఫిర్యాదులు/ సమాచారం/ సహాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి తగు సేవలు అందించడంలో రిసెప్షన్ అధికారి యొక్క పాత్ర కీలకమైనదని, ప్రజలందరికీ పోలీస్ వ్యవస్థపై నమ్మకం విశ్వాసం కల్పించడంలో రిసెప్షన్ అధికారి ముఖ్య పాత్ర వహిస్తారని అన్నారు. శిక్ష‌ణా కార్య‌క్ర‌మంలో భాగంగా వారికి త‌గు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చారు. అనంత‌రం ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసా పత్రాలను అంద‌జేశారు.

ఈ కార్యక్రమంలో అడ్మిన్ డిసిపి అఖిల్ మహాజన్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మోహన్, సి సి ఆర్ బి ఇన్స్పెక్టర్ రాజకుమార్, రిసెప్షన్ వర్టికల్ ఇంచార్జ్ పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్, ఐటి కోర్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రాము, రహీం, రిసెప్షన్ వర్టికల్ సిబ్బంది పాల్గొన్నారు.

2 Comments
  1. watch Devotion online says

    Brown encounters discrimination everywhere he goes, whether or not from bartenders refusing to serve him or drunken louts trotting out the laziest slurs they’ve received.

  2. Simply want to say your article is as astonishing. The clarity in your
    post is simply nice and i can assume you are an expert on this
    subject. Well with your permission let me to grab your feed to keep up
    to date with forthcoming post. Thanks a million and please carry on the enjoyable work.

Leave A Reply

Your email address will not be published.