66 వేల ఆరువందల మంచి ముత్యాలతో రామకృష్ణ పరమహంస చిత్రపటం..

మండపేట (CLiC2NEWS): ప‌ట్ట‌ణంలోని బాలికోన్నత పాఠశాల విద్యార్థిని కమ్మిలి లీలా శృతి మంచి ముత్యాలతో రామకృష్ణ పరమహంస చిత్రపటాన్ని తయారుచేసింది. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుకుంటున్న విద్యార్థిని తల్లిదండ్రులు వీర్రాజు వీరరాజేశ్వరి. చిన్నప్పటినుండి చిత్రలేఖనంపై ఆసక్తి ఉన్న లీలా శృతికి రామకృష్ణ పరమహంస అంటే ఎంతో ఇష్టం. రామకృష్ణ పరమహంస ఒక ప్రాజెక్టు తయారు చేయాలని సంకల్పించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సరోజినీ, డ్రాయింగ్ టీచర్ మందపల్లి సత్యానందం మాస్టర్ ల ప్రోత్సాహంతో రామకృష్ణ పరమహంస చిత్రపటాన్ని 66 వేల ఆరువందల మంచి ముత్యాల‌తో తయారు చేసింది.

పెయింటింగ్ తో కాకుండా భిన్నంగా చిత్రపటాన్ని తయారుచేయాలని డ్రాయింగ్ టీచర్ సత్యానందం మాస్టారు సలహా ఇవ్వడంతో మంచి ముత్యాలను సేకరించి ఒక అట్టపై రామకృష్ణ పరమహంస బొమ్మను గీసి మంచి ముత్యాలను పేర్చింది. రామకృష్ణ పరమహంస రూపం వచ్చే విధంగా తయారు చేయడం జరిగింది. ఇదంతా కేవలం వారం రోజుల్లో పూర్తి చేసినట్లు తెలిపింది.

ఈ ప్రాజెక్టు ను వరల్డ్ రికార్డ్స్ కు పంపనున్నట్లు ఆమె తెలిపింది. అనంతరం రాజమండ్రి లో ఉన్న రామకృష్ణ మఠానికి కానుకగా అందజేయనున్నారు. సోమవారం ఈ చిత్ర పటాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ రాణి మాట్లాడుతూ బాలికల్లో ఎంతో సృజనాత్మకశక్తి కళాత్మక శక్తి దాగి ఉందని వాటిని చదువు చెబుతున్న గురువులు వెతికి తీసి వారిని మరింత ప్రతిభావంతులుగా తీర్చి దిద్దుతున్నారని ఆమె ప్రశంసించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ పిల్లి గనేశ్వరరావు, కౌన్సిలర్ లు చిట్టూరి సతీష్, గ్రంథి శ్రీనివాస్, పిల్లి శ్రీనివాస్, మందపల్లి రవికుమార్, మారిశెట్టి సత్యనారాయణ, కొవ్వాడ బేబీ, నీలం దుర్గమ్మ, ఎర్నేని ప్రభావతి, శెట్టి కళ్యాణి, బొక్కా సరస్వతి, అమలదాసు లక్ష్మి, మలసాని సీతామహలక్ష్మి, టౌన్ వైఎస్ఆర్ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, వైఎస్సార్ నాయకులు జొన్నపల్లి సత్తిబాబు, అడబాల వీరబాబు, కొడమంచిలి భాస్కర రావు, అమలదాసు రుద్రమూర్తి, కొవ్వాడ అప్పన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.