పదవీ విరమణ పొందిన అధికారులను సత్కరించిన రామంగుండం సిపి

రామగుండం పోలీస్ కమిషనరేట్ (CLIC2NEWS): పోలీస్ శాఖ నందు సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులను రామగుండం సిపి ఎం.శ్రీనివాస్ సత్కరించారు. రామగుండం పోలీస్ కమీషనర్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పదవీ విరమణ కార్యక్రమంలో రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు. పదవీ విరమణ పొందుతున్న కె. పోచయ్య ఎస్ఐ, ఎ ఆర్ ఎస్ఐ కె. శ్రీనివాసులు.. వారి కుటుంబ సభ్యుల తో కలిసి శాలువా, పూలమాలతో సత్కరించి జ్ఞాపిక అందచేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి అడ్మిన్ సి.రాజు, ఎఆర్ ఎసిపి ప్రతాప్, సుందర్ , ఏఓ అశోక్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు దామోదర్, వామన మూర్తి, సంపత్, శ్రీనివాస్, మల్లేశం, సూపరింటెండెంట్ ఇంద్ర సేనా రెడ్డి, మనోజ్ కుమార్, రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లా కుంట పోచలింగం, స్వామి, పదవి విరమణ అధికారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.