‘ఆర్ఆర్ఆర్’ టీంకు రామ్‌చరణ్ గిప్ట్

ఆర్ ఆర్ ఆర్ సినిమా కలెక్షన్లపరంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసినదే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది రోజుల్లోనే వందల కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమా సక్సెస్‌ను హీరోలు, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య సహా అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఆర్ ఆర్ ఆర్ టీంకు ఊహించని బహుమతి అందించాడు. ఈ చిత్రం కోసం పని చేసిన వివిధ విభాగాలకు చెందిన వారు, కెమెరా అసిస్టెంట్లను, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్లను, మేనేజర్లను, అకౌంటెంట్లను, స్టిల్ ఫోటో గ్రాఫర్ అసిస్టెంట్లను సుమారు 35 మందిని ఇంటికి ఆహ్వానించి వారికి ఒక్కోతులం బంగారం కానుకగా ఇచ్చాడు.