బెంగళూరులో రేవ్ పార్టీ.. శ్రద్ధాకపూర్ సోదరుడు అరెస్ట్

బెంగళూరు (CLiC2NEWS): ప్రముఖ బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్‌ని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి బెంగళూరులోని ఎంజిరోడ్‌లో వీకెండ్ పార్టీ జరుగుతుందని అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో సుమారు 35 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిలో సిద్ధాంత్ కూడా ఉన్నారు. వారి శాంపిల్స్‌ని సేకరించి పరీక్షలకు పంపించారు. డ్రగ్స్ నిర్ధారణ అయిన ఆరుగురిలో సిద్ధాంత్ కపూర్ ఒకరని పోలీసులు వెల్లడించారు. వీరంతా డ్రగ్స్ తీసుకొని పార్టీకి వచ్చారా.. లేదా పార్టీలోనే డ్రగ్స్ తీసుకున్నారా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.