కన్న తల్లికి నిజమైన ఆనందం..

కన్న తల్లికి నిజమైన ఆనందం.. నవమాసాలు మోసి పురిటి నొప్పులు పడుతున్న వేళ పుడుతుందేమో…
ఎందుకంటే… మరుక్షణంలో నిన్ను చూస్తానేమోనని..
తను కళ్ళు తెరిచి తెరవగానే నీకోసం తల్లడిల్లే ఆ తల్లి నిస్వార్ధ ప్రేమ ముందు…
నీ కళ్ళు తెరచి తెరవగానే కడుపు కోసం తల్లికై వెతికే స్వార్ధ ప్రేమకి…
ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అమ్మ అని.. ఏనాడైనా అడిగావా..

తన కనులు తెరిచి చూసిన క్షణం నుంచి తను కళ్ళు మూసే క్షణం వరకు… నీ కోసం ఆలోచించే నిస్వార్థ ప్రేమ ముందు..
ఎప్పుడైనా అడిగావా ఏమిచ్చి రుణం తీర్చుకోవాలని అమ్మ అని..

పురిటిలో తాను కన్ను మూసే దురదృష్ట క్షణాలు కనిపిస్తున్న… నీ వున్నావని అదృష్టంగా భావిస్తూ కన్ను మూసే తల్లి ప్రేమ ముందు…
ఏరోజైనా అడిగావా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలని అమ్మ అని…

కష్టాల కలల్ని కనలేక…. కన్నీళ్లు తాగి… కన్నీటిని తను కన్న వాళ్ళ ముందు దాస్తున్న నిస్వార్ధ ప్రేమ ముందు
ఏరోజైనా అడిగావా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలని అమ్మ అని….

మండుటెండలో నడిచేటి నీ కాళ్ళకి చెప్పులా మారినా నిస్వార్ధ ప్రేమ ముందు….
ఏరోజైనా అడిగావా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలని అమ్మ అని….

వర్షంలో నీకు గొడుగై నీ మీద చినుకు వాలకుండా తన కొంగునే నీ కై గొడుగు గా మలచిన నిస్వార్ధ ప్రేమ ముందు…
ఏరోజైనా అడిగావా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలని అమ్మ అని….

చలికి నువు వణుకుటుంటే కౌగిట చేర్చుకొని వెచ్చని ప్రేమని అందించిన నిస్వార్ధ ప్రేమ ముందు….
ఏరోజైనా అడిగావా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలని అమ్మ అని…

సుస్తీ నీకు జేస్తే సృష్టినే శపించే నిస్వార్ధ ప్రేమ ముందు…
ఏరోజైనా అడిగావా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలని అమ్మ అని…

నడక నీదై నడుస్తున్న వేళ గమ్యమే నేనని మురుస్తున్న కన్న తల్లి నిస్వార్ధ ప్రేమ ముందు
ఏరోజైనా అడిగావా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలని అమ్మ అని…

నీ తోడుగా ఒకరు నిలుచునే వేళ నా చంటి వాడని మురిసె కన్న తల్లి ప్రేమ ముందు
ఏరోజైనా అడిగావా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలని అమ్మ అని….

తను కన్న వారే మరో జన్మనిస్తే కళ్ళకి అద్దుకునే నిస్వార్ధ ప్రేమ ముందు
ఏరోజైనా అడిగావా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలని అమ్మ అని….

తను రాలుతున్న నా గుర్తుగ నువ్వు ఉన్నావాని కన్నులు మూసే కన్న తల్లిని నిస్వార్ధ ప్రేమ ముందు
ఏరోజైనా అడిగావా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలని అమ్మ అని….

-అనుముల పోచయ్య యాదవ్

ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు

1 Comment
  1. Earn Online says

    Wow, marvelous blog format! How lengthy have you ever been running a blog for? you make running a blog glance easy. The overall glance of your site is wonderful, let alone the content material!!

Leave A Reply

Your email address will not be published.