IDBI Bank: 600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానం

ముంబయి (CLiC2NEWS): ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐ లో 600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయింది. నేటి నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్‌లో పరీక్షను నిర్వహిస్తారు. 2023 జనవరి 1 నాటికి అభ్యర్థులు 21 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్ సి, ఎస్‌టి, ఒబిసి, పిడబ్ల్యుడి, ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.36,000 నుండి 63,840 వరకు వేతనం ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, ప్రీ రిక్య్రూట్ మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షలో ప్రతి తప్పుగా గుర్తించిన సమాధానానికి నెగెటివ్ మార్కు ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్షలో అర్హత సాధించిన వారే ఇంటర్వ్యూకి వెళతారు.