సికింద్రాబాద్ మెట్లబావికి పునర్వైభవం.. ప్రధాని మోడి ప్రశంస

హైదారాబాద్ (CLiC2NEWS): సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట మెట్లబావికి పునర్వైభం తీసురురావడానికి ప్రధాన మంత్రి నరేంద్రమోడి ప్రశంసించారు. దేశంలో జల సంరక్షణ, భూగర్భ జలాలు కాపాడేందుకు విశేష కృషి చేస్తున్నారని.. తమిళనాడుకు చెందిన అరుణ్ భూరర్భ జలాల అభివృద్ధి కార్యక్రమం చేపట్టారని మోడి తెలిపారు. బన్సీలాల్ పేటలోని చారిత్రక మెట్లబావికి పునర్వైభవం తీసుకొచ్చారని, కాల క్రమేణా మట్టి, చెత్తతో నిండిన ఆ బావి నేడు అలనాటి వైభవాన్ని చాటుతోందన్నారు. మహారాష్ట్రలో ఓ పురాతన మెట్లబావిని శుభ్రపరిచారని తెలిపారు. సమాజంలోని వ్యక్తులు స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని, వారి సేవలను ప్రధానమంత్రి కొనియాడారు.