నిజాంసాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేసిన స్పీకర్ పోచారం
కామారెడ్డి (CLiC2NEWS): జిల్లా నిజాం సాగర్ మండల్ నిజాం సాగర్ ప్రాజెక్ట్ నుంచి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర రోడ్లు & భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యీ హన్మంత్ షిండే, జిల్లా పరిషత్ చైర్మన్ శోభన్ రాజు, పొచారం సురేందర్ రెడ్డి, జిల్ల కలెక్టర్, జిల్లా ఉన్నత స్థాయి అధికారులు బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని మండలంలోని సర్పంచ్ లు, PACS ఛైర్మన్ లు, ZPTC, MPP లు, ఆయా ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.