Remdesivir విక్రయిస్తున్న ఖమ్మం ఆసుపత్రి సిబ్బంది అరెస్టు!

ఖమ్మం (CLiC2NEWS): జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రెమ్‌డెసివిర్ విక్రయిస్తున్న ముగ్గురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రెమ్‌డెసివిర్ ను పలువురు అధికధరలకు విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఆసుపత్రిలో అధిక ధరకు రెమ్‌డెసివిర్ ను విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ముగ్గురు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దవాఖానాలో విధులు నిర్వహిస్తున్న స్టాఫ్ నర్సు, ఇద్దరు ఇతర ఉద్యోగులు కలిసి ఒక్కో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్‌ను రూ. 38 వేలకు విక్రయించేందుకు యత్నించారు. ఈ మేరకు వారిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 6 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.