రేణిగుంట-గుల్బర్గా స్టార్ అలియన్స్ సర్వీస్ రద్దు.. ప్రయాణికుల అందోళన
రేణిగుంట (CLiC2NEWS): రేణిగుట-గుల్బర్గా స్టార్ అలియన్స్ విమాన సర్వీసును సంస్థ రద్దు చేసింది. దీంతో రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ముందస్తు సమాచారం లేకుండా విమాన సర్వీసును రద్దు చేయడంపై ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం నుండి వేచి ఉన్న ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదని ఆగ్రమం వ్యక్తం చేశారు. ఎయిర్లైన్స్ తీరును నిరసిస్తూ విమానాశ్రయంలోనే నిరసనకు దిగారు.