మరమ్మత్తు పనులు వాయిదా… మంచినీటి సరఫరా యథాతథం

హైదరాబాద్ (CLiC2NEWS) : హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-2 1600 ఎంఎం రింగ్ మెయిన్ -2 పైపులైను జంక్షన్ పనుల కోసం తేది. 04.08.2021 బుధవారం ఉధయం 6 గంటల నుంచి మరుసటి రోజు అనగా తేది.05.08.2021 ఉదయం 6గంటల వరకు 24 గంటల పాటు పైపులైనుకు చేపట్టాల్సిన మరమ్మత్తు పనులను అనివార్య కారణాల వల్ల వాయిదా వేయడం జరిగింది.
కాబట్టి నగరంలో అన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరా యథాతథంగా కొనసాగుతుంది. మరమ్మత్తు చేపట్టే తేదిలను తిరిగి ప్రకటిస్తామని జలమండలి అధికారులు తెలియజేసినారు.