శ్రీరాంసాగర్‌ 8 గేట్లు ఎత్తివేత

నిండుకుండలా జ‌లాశాయాలు

హైదరాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో ప్రాజెక్టులు నిండుకుండ‌ల‌ను త‌ల‌పిస్తున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలోనే అత్య‌ధికంగా నిర్మ‌ల్ జిల్లా దిలావ‌ర్పూర్ మండ‌లంలో 2.65 సెంటీమీట‌ర్ల వ‌ర్షం కురిసింది. వ‌ర్షాల కార‌ణంగా నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 8 గేట్లను అధికారులు గురువారం ఎత్తివేశారు. ఎనిమిది గేట్లను ఎత్తి దిగువకు 50వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 4,32,325 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1,091 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1090 అడుగులు ఉన్నది.

గరిష్ఠ నీటినిల్వ 90 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 84.810 టీఎంసీల నీరు ఉంది. ఈ సారి జూలై ఆఖ‌రులోపే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నది. గతేడాది ఇదే సమయానికి ఎస్సారెస్పీలో కేవలం 33 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నట్లుగా అధికారులు చెప్పారు. ఈ క్రమంలో గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

శ్రీ‌పాద ఎల్లంప‌ల్లి జ‌లాశ‌యం

మంచిర్యాల జిల్లాలోని శ్రీ‌పాద ఎల్లంప‌ల్లి జ‌లాశ‌యం 10 గేట్ల‌ను ఎత్తి నీటిని కిందివి వ‌దులుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిసామ‌ర్థ్యం 20.175 టిఎంసీలు కాగా. ప్ర‌స్త‌తం 19.647 టిఎంసిల‌కు చేరింది.

కడెం ప్రాజెక్టు
పార్వతీ బ్యారేజ్‌
1 Comment
  1. […] శ్రీరాంసాగర్‌ 8 గేట్లు ఎత్తివేత […]

Leave A Reply

Your email address will not be published.