నగరంలో హైడ్రా చర్యలు.. బతుకమ్మ కుంటలో ఉబికి వచ్చిన నీరు

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని అంబర్‌పేటలో ఉన్న బతుకమ్మ కుంట చెరువు పరిరక్షణ కోసం హైడ్రా న్యాయస్థానంలో పోరాటం చేసింది. హైకోర్టు ఆదేశాలతో చెరువు పునరుద్ధరణ పనలు ఇటీవల చేపట్టింది. సుమారు 16 ఎకరాల్లో ఉండాల్సిన బతుకమ్మ కుంట ఆక్రమలణకు గురై చివరకు 5 ఎకరాలకు కుంచించుకుపోయింది. రెవెన్యూ , నీటిపారుదల శాఖ అధికారులు ఇచ్చిన ఆధారాలతో బతుకమ్మ కుంట పరిధిని నిర్ధారించారు. అనంతరం పునరుద్ధరణ పనులను చేపట్టగా.. మోకాలిలోతు వరకు తవ్వగానే నీరు ఉబికివచ్చినట్లు సమాచారం. దీంతో హైడ్రా అధికారులు, స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. బతుకమ్మ కుంటలో నీళ్లు రావడంతో స్థానికులు పుష్పాలతో స్వాగతించారు. కానీ.. తవ్వకాల్లో పైప్‌లైన్‌లు పగిలి నీరు బయటికి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నగర జలమండలి అధికారులు వచ్చి పరిశీలించగా.. ఎలాంటి పైప్‌లైన్ అక్కడ లేదని.. పూర్తిగి భూగర్భంలో నుండి నీరు వచ్చినట్లు నిర్ధరించారు.