తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి.. 7న ప్ర‌మాణ స్వీకారం..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): రాష్ట్ర నూత‌న సిఎంగా రేవంత్‌రెడ్డిని ఎంపిక చేస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణ‌యించింది. రాష్ట్రంలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ 64 సీట్లు సాధించి ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డానికి సిద్ధ‌మైంది. అయితే సిఎంగా ఎవ‌ర‌నే విష‌యంపై రెండు రోజులుగా పార్టీ నేత‌లు మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. తెలంగాణ సిఎంగా ఎవ‌ర‌నేది అధిష్టానం నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని వెల్ల‌డించారు. తాజాగా కొన‌సాగుతున్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. మంగ‌ళ‌వారం ఎఐసిసి అధ్య‌క్షుడు ఖ‌ర్గే నివాసంలో డిఎస్ శివ‌కుమార్‌, ఉత్త‌మ్‌కుమార్‌, భ‌ట్టి భేటీ అయ్యారు. గ‌త రెండు రోజులుగా ఎల్లా హోట‌ల్ లో ఉన్న రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లారు.అధిష్టానం పిలుపు మేర‌కు ఆయ‌న ఢిల్లీ వెళ్లారు. కాగా.. అధిష్టానం రేవంత్ రెడ్డిని సిఎల్‌పి నేత‌గా ఎంపిక చేసిన‌ట్లు ఎఐసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వేణుగోపాల్ ఢిల్లీలో ప్ర‌క‌టించారు. డిసెంబ‌ర్ 7న ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌ని తెలియ‌జేశారు.

Leave A Reply

Your email address will not be published.