ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం
Asian Boxing Championship: ఆసియా మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో భారత్‌కు చెందిన క్రీడాకారిణి రితిక పసిడి పతకం సాధించింది. మహిళల ప్లస్ 80 ఫైనల్లో రితిక.. కజికస్తాన్ క్రీడాకారిణి అస్సెల్ టోక్టాసిస్ పై విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అదేవిధంగా 57 కేజిల విభాగంలో యాత్రి పటేల్, 60 కేజీల విభాగంలో ప్రియ రజత పతకాలు సాధించారు.
పురుషుల బాక్సింగ్ లో నీరజ్ 75 కేజీలు , ఇషాన్ కటారియా 90 కేజీల విభాగంలో రతతాలు సాధించారు. ఈ టోర్నిలో భారత్ అండర్ 22 జట్టు.. 13 పతకాలు సాధించి, నాలుగో స్థానంలో నిలవగా.. అండర్ 19 జట్టు 14 పతకాలు సాధించి, రెండో స్థానంలో నిలిచింది.
Also Read: రానున్న మూడు రోజులు జాగ్రత్త.. హైడ్రా