జూన్ 28 నుండి రైతుల ఖాతాల్లో ‘రైతుబంధు’ నిధులు..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో తొమ్మిదో విడత ‘రైతుబంధు’ నిధులు ఎల్లుండి నుండి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ. 10వేల చొప్పున ఇప్పటివరకు రూ. 50,447.33 రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. రైతు బీమ పథకం ద్వారా 83,118 మంది రైతు కుటుంబాలకు రూ. 4,150.90 కోట్లు పరిహరం అందజేసినట్లు పేర్కొన్నారు. సీజన్‌కు ముందే ఏ పంటలు వేయాలో రైతులకు సూచించడానికి దేశంలోనే మొదటిసారిగా మార్కెట్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్‌ను ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు.